‘వివాటెక్’లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
‘వివాటెక్’లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివాటెక్-2021 ఐదో ఎడిషన్‌లో ప్రసంగించనున్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో పాటు ఈయూలోని వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ఎంపీలు పాల్గొనున్నారు.

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వివాటెక్-2021 ఐదో ఎడిషన్‌లో ప్రసంగించనున్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో పాటు ఈయూలోని వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ఎంపీలు పాల్గొనున్నారు. ఆపిల్ సీఈఓ టీమ్‌కుక్, ఫేస్బుక్ చైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్‌తో పాటు తదితర ప్రముఖులు హాజరవనున్నారు. ‘వివాటెక్’ యూరోప్‌లో జరిగే అతిపెద్దదైన డిజిటల్, స్టార్టప్ కార్యక్రమాల్లో ఒకటి. 2016 నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలను పారిస్‌లో జరుపుతున్నారు. కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మీడియా గ్రూప్ లెస్ ఇకోస్ ప్రముఖ అడ్వటైజింగ్, మార్కెటింగ్ రంగంలోని ప్రముఖ సంస్థ అయిన పబ్లిసిస్ గ్రూప్‌తో కలిసి నిర్వహిస్తున్నది.
కార్యక్రమం సాంకేతిక విజ్ఞాన రంగంలో.. స్టార్టప్ ఇకో సిస్టమ్‌లో భాగం పంచుకుంటున్న సంస్థలను ఒకే చోటులో సమావేశ పరుస్తోంది. ప్రదర్శనలు, పురస్కారాలు, గ్రూప్ డిస్కషన్, స్టార్టప్ పోటీలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉండనున్నాయి. వివాటెక్ ఐదో ఎడిషన్ సమావేశాలు బుధవారం నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీని వివాటెక్ గౌరవ అతిథిగా ఆహ్వానించిందని పీఎంఓ తెలిపింది. సాయంత్రం 4 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో ప్రసంగిస్తారని పేర్కొంది. ‘టెక్-స్టార్టప్ ప్రపంచంలో భారత్ సాధించిన పురోగతి’పై ప్రధాని కీలకోపన్యాసం చేస్తారని పీఎంఓ వివరించింది.
ఇవి కూడా చదవండి..
సిద్ధమైన ‘నారప్ప’
చీలమండకు అండ!
నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
విషాదం : గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 5th edition
- Address
- France
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

