Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Chinmay Sutar: రంజీ మ్యాచ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ సుతార్ చరిత్ర సృష్టించాడు. నాగాలాండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అతను వ్యక్తిగతంగా 400 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 29 ఏళ్ల సుతార్ తన రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
దిమాపుర్: మిజోరం బ్యాటర్ చరిత్ర సృష్టించాడు. నాగాలాండ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో .. చిన్మయ సుతార్(Chinmay Sutar) 400 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 29 ఏళ్ల సుతార్ తన రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో పృథ్వీ షా పేరిట ఉన్న 379 పరుగుల సెకండ్ హయ్యెస్ట్ స్కోరు మొలురాయిని సుతార్ దాటేశాడు. మిజోరం 155వ ఓవర్లో సుతార్ ఆ రికార్డు అందుకున్నాడు. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి 393 వద్ద నాటౌట్‌గా ఉన్న అతను.. ఆ తర్వాత 400 మైలురాయి చేరుకున్నాడు. మిజోరం తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 581 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. చివరి వికెట్‌కు లాల్రెంపుయాతో కలిసి అతను 189 రన్స్ జోడించారు. సుతార్ గతంలో ముంబై స్థానిక జట్లకు ఆడాడు. సింద్ స్పోర్ట్స్ క్లబ్లో కొన్నాళ్లు ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చేరాడు. ముంబై అండర్-23 జట్టులో ఆడినా.. సీనియర్ లెవల్లో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో 517 బంతులు ఆడిన సుతార్ ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

