Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Bathukamma Celebrations | విదేశాల్లో బతుకమ్మపండుగను విశేషరీతిలో నిర్వహించడంలో ప్రసిద్ధి పొందిన ‘టి-ప్యాడ్’ ఈ దఫా 15వేల మందితో వేడుకలను భారీ ఎత్తున నిర్వహించింది.
ఫ్రిస్కో: విదేశాల్లో బతుకమ్మపండుగను విశేషరీతిలో నిర్వహించడంలో ప్రసిద్ధి పొందిన ‘టి-ప్యాడ్’ ( T-PAD) ఈ దఫా 15వేల మందితో వేడుకలను భారీ ఎత్తున నిర్వహించింది. అమెరికా ( America ) లోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో ( Frisco ) నగరంలో గల ప్రతిష్టాత్మక కొమెరికా సెంటర్ వేదికగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ( Bathukamma Celebrations ) తెలుగువారు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా వేడుకలకు హాజరై విజయవంతం చేశారు.

బతుకమ్మ ఆటపాటలు ప్రాంగణానికి తెలంగాణ సంప్రదాయ పరిమళాలతో కొత్త వన్నెలద్దాయి. కనీసం వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. అనంతరం శాస్త్రోక్తంగా, పద్ధతి ప్రకారం బతుకమ్మల నిమజ్జన నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన మహిషాసుర మర్ధిని నృత్యరూపం ఆకట్టుకుంది.
ఉర్రూతలూగించిన నవీన్ పోలిశెట్టి

వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రైమ్ టైమ్ ఈవెంట్ అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ నటుడు నవీన్ పోలిశెట్టి ఈ వేడుకలకు ప్రత్యేకంగా హాజరై సందడి చేశారు. సభికులతో నేరుగా మాట్లాడుతూ చమక్కులు విసురుతూ, యువతతో పాటు చిన్నపిల్లలను వేదికపైకి ఆహ్వానించి వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ ప్రాంగణాన్ని ఉర్రూత లూగించారు. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్ఫ్యూజన్ బ్యాండ్’ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ భారీ కార్యక్రమాన్ని టి-ప్యాడ్ ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వ నాయకత్వం లో విజయవంతం చేశారు. దాదాపు 20 కమిటీలకు చెందిన వాలంటీర్లు గడిచిన రెండు మూడు నెలలుగా రేయింబవళ్లు శ్రమించి ఈవెంట్‌ను మరపురానిదిగా నిలపడంలో తీవ్ర కృషి చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సురక్షితమైన సెక్యూరిటీ చెకింగ్స్తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సాఫీగా సాగింది. కార్యక్రమం విజయవంతమైన సందర్భం గా టి-ప్యాడ్ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేసింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

