సమర్ఖండ్: ఉజ్జెకిస్తాన్‌లోని సమరఖండ్ నగరంలో ఇవాళ ఎస్సీవో(షాంఘై కోపారేషన్ ఆర్గనైజేషన్) సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఎస్సీవో సభ్య దేశాల నేతలతో మోదీ ఇవాళ గ్రూపు ఫోటో దిగారు. ప్రాంతీ, అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో ముచ్చటించనున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరింద్ బాగ్చి తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రత, వాణిజ్యం, సంస్కృతి, టూరిజం అంశాలను కూడా ఆయన చర్చించనున్నట్లు చెప్పారు. ఎస్సీవో నేతలు దిగిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేశారు. మరికాసేపట్లో పుతిన్‌తో మోదీ భేటీకానున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.