పీఎం మోదీ రైతు వ్యతిరేకి
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
- సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, పార్టీ
భువనగిరి అర్బన్, మార్చి 24 : ప్రధాని మోదీ రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పంజాబ్‌లో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వెనుకంజ వేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి గాకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టట్లేదని ప్రశ్నించారు.
రైతుల లొల్లి ఢిల్లీకి తాకాలి : ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనాలాని నియోజకవర్గంలో చేపట్టిన రైతుల లొల్లి ఢిల్లీకి తాకాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేయడానికి రైతు చట్టాలు తీసుకొస్తున్నదన్నారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌కు కట్టబెట్టాలని చూస్తున్నదన్నారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వాలు కొనసాగలేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ గద్దె దిగడం ఖాయమని పేర్కొన్నారు.
నిరసనలకు రైతులు సిద్ధంగా ఉండాలి : జడ్పీ చైర్మన్
రైతు వ్యతిరేక చట్టాలు తేవాలని చూడడం, వరి ధాన్యం కొనుగోలులో వెనుకంజ వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు సిద్ధంగా ఉండాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలనే విషయంపై తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించాలన్నారు.
పోరాటాలకు రైతాంగం
ముందుండాలి : రామకృష్ణారెడ్డి
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలనే పోరాటాలకు రైతాంగం ముందుండాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకపోతే వడ్లను కొనుగోలు చేయాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలపై జాతీయ స్థాయిలో ఉద్యమాలకు పార్టీ కార్యకర్తలు, రైతులు ముందుండాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

