సిమ్లా: ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఒక వ్యవస్థ కాదని, అది భారత జీవన విధానంలోనే ఇమిడి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా ప్రతినిధులు భారతీయ విలువలకు కట్టుబడి పనిచేయాలన్నారు. 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ అధికారుల కాన్ఫరెన్స్(ఏఐపీవోసీ) ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘వన్ నేషన్, వన్ లెజిస్లేటివ్ ప్లాట్ఫామ్’ (ఒకే దేశం, ఒకే శాసన వేదిక) ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇలాంటి పోర్టల్.. పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక దన్ను అందించడంతోపాటు, దేశంలోని ప్రజాస్వామ్య విభాగాలన్నింటినీ అనుసంధానిస్తుందన్నారు.