న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై చేరుకున్నారు. భారత్ ప్రధాని బ్రూనై రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బ్రూనై 29వ సుల్తాన్‌గా 1968లో పట్టాభిషిక్తుడైన రాజు హాజీ హసనల్ బోల్కియా రాజవైభోగాల గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. 30 బిలియన్ కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల టాప్ జాబితాలో ప్రతి ఏడాది స్థానం పొందే ఆయన లగ్జరీ వాహనాల కలెక్షన్లో 7,000 అత్యంత ఖరీదైన వాహనాలు ఉన్నాయి. 1979 నుంచి ఆయనకు మూడు సొంత విమానాలతో పాటు హెలికాప్టర్లు ఉన్నాయి. ఆయన నివాసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొంది గిన్నిస్ బుక్‌లో స్థానం పొందింది. లక్షలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగారు గోపురాలతో నిండి ఉంటుంది.