న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్లో 30, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. ప్రజలు పెద్ద ఎతున పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువ ఓటర్లు తమ హక్కునును వినియోగించుకోవాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. 254 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు అసోంలో 8.84శాతం, బెంగాల్లో 7.72శాతం ఓటింగ్ శాతం నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
Today, Phase 1 of the West Bengal Assembly elections begin. I would request all those who are voters in the seats polling today to exercise their franchise in record numbers.
— Narendra Modi (@narendramodi) March 27, 2021
The first phase of elections begin in Assam. Urging those eligible to vote in record numbers. I particularly call upon my young friends to vote.
— Narendra Modi (@narendramodi) March 27, 2021