వరంగల్, డిసెంబర్ 25: వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కాలం నాటి ప్రధాన రహదారులు ఇప్పుడు స్మార్ట్‌గా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరుగులు పెడుతోంది.రూ. 163.69 కోట్లతో ప్రధాన రహదారుల అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం రూ. 110 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం, ఎంజీఎం నుంచి వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా అక్కడి నుంచి వరంగల్ రైల్వే స్టేషన్, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్, వరంగల్ చౌరస్తా నుంచి హంటర్ రోడ్డును కలుపుతూ స్మార్ట్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తయి, సెంట్రల్ లైటింగ్‌తో వరంగల్ తూర్పు నియోజకవర్గం వెలిగిపోనుంది.
కాకతీయ వారసత్వ సంపద ఆనవాళ్లు అడుగడుగునా కనిపించే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నాయి. వరంగల్ ప్రాంతం గత నాలుగేళ్ల నుంచి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నిజాం కాలం నాటి ప్రధాన రోడ్లతో ఉన్న వరంగల్ ప్రాంతమంతా ఇప్పుడు ఎటూ చూసిన స్మార్ట్రోడ్లతో కళకళలాడుతున్నది. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. దశాబ్దాల కాలం నాటి ప్రధాన రహదారులు ఇప్పుడు స్మార్ట్‌గా కనిపిస్తున్నాయి. తూర్పు నియోజకవర్గమంతా కలుపుతూ ఉన్న ప్రధాన రహదారులు స్మార్ట్‌గా మారుతున్నాయి. రూ. 163.69 కోట్లతో నియోజకవర్గంలో ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం రూ. 110 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. రెండు ప్యాకేజీలతో స్మార్ట్ నిధులతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ములుగురోడ్డు నుంచి ఎంజీఎం, ఎంజీఎం నుంచి వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా అక్కడి నుంచి వరంగల్ రైల్వేస్టేషన్, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా నుంచి హంటర్రోడ్డును కలుపుతూ స్మార్ట్‌రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తయి సెంట్రల్ లైటింగ్‌తో వరంగల్ తూర్పు నియోజకవర్గం రహదారులు వెలిగిపోనున్నాయి.
మారనున్న నగర రూపురేఖలు
ప్రధాన రహదారులు స్మార్ట్ రోడ్లుగా మారుతుండడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక దృష్టి సారించి స్మార్ట్రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. స్మార్ట్రోడ్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సైకిల్ ట్రాక్‌లతోపాటు పాదచారులకు ఫుట్‌పాత్‌లు, మధ్యలో గ్రీనరీ, లైటింగ్, డిజిటల్ ప్రకటనల బోర్డులు, పోర్టబుల్ టాయిలెట్లు, వాటర్ ఏటీఎంలు, మధ్యలో పార్కులు, స్మార్ట్ బస్షెల్టర్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి.
రూ. 110 కోట్లతో రహదారుల అభివృద్ధి
వరంగల్ ప్రాంతంలో సుమారు రూ. 110 కోట్ల నిధులతో చేపట్టిన స్మార్ట్‌రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రెండు ప్యాకేజీల్లో రూ. 163 కోట్ల నిధులతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం నియోజవర్గంలో రూ. 110 కోట్ల నిధులతో రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గమంతా అనుసంధానం చేసేలా ప్రధాన రహదారులను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఎటు చూసినా స్మార్ట్‌రోడ్ల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి.
నభూతో నభవిష్యత్‌గా అభివృద్ధి
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని నభూతో న భవిష్యత్‌గా అభివృద్ధి చేస్తున్నాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా. అన్ని ప్రధాన రహదారులను స్మార్ట్‌గా అభివృద్ధి చేస్తున్నాం. పనులు పురోగతిలో ఉన్నాయి. కొద్ది నెలల్లో తుది దశకు చేరుకుంటాయి. పర్యాటక హబ్‌గా మారుతున్న వరంగల్ ప్రాంతంలోని అన్ని ప్రధాన రహదారులను స్మార్ట్‌గా అభివృద్ధి చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నా.
– నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే