కొల్లాపూర్ : హైడల్ పవర్‌తో పాటు పంప్డు స్టోరేజ్‌తో ( Pumpd Storage ) పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka
) విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జెన్ కో, ట్రాన్స్ కో అధికారులతో కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ( Somaseela ) వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై మూడు పాయింట్స్ ను గుర్తించి వాటి మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. జూరాల ( Jurala ) నుంచి పులిచింతల ( Pulichintala ) వరకు కృష్ణా మీద ఉన్న హైడల్ పవర్ ( Hydel Projects ) ప్రాజెక్టులను సమీక్షించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరం అయితే ప్రపంచ పేరుగాంచిన కన్సల్టెంట్ల సేవలను ఉపయోగించు కోవాలని ఆదేశించారు.
సోలార్ ద్వారా పగలు జరిగే ఉత్పత్తిని స్టోరేజ్ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికతను, దానికి అవసరమైన స్టోరేజ్ వ్యవస్థను రూపొందించి కోవాలన్నారు. రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హితమైన పవర్ ను ఉత్పత్తి చేసి అందించాలన్నారు.
రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఇరవై ఏళ్లకు సరిపడా విద్యుత్తు ఉత్పత్తిని అందుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. గ్రీన్ హైడ్రోజన్ , ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ సోలార్ థర్మల్ పవర్ , పవన విద్యుత్తు, అణువిద్యుత్తు బ్యాటరీ స్టోరేజ్ లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్ వినియోగాన్ని ఎక్కువ మొత్తం లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.