హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా జరుపుకొన్నారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం పెన్రోజ్, మొలుకూరు కిడ్హలలో టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు జగన్‌రెడ్డి వొడ్నాల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు కొసన విజయభాసర్, గౌరవ చైర్పర్సన్ కళ్యాణ్‌రావు కాసుగంటి, ప్రధానకార్యదర్శి అరుణ్ ప్రకాశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాచకొండ రామారావు, నార్త్ ఐలాండ్ ఇంచార్జ్ డాక్టర్ మోహన్‌రెడ్డి బీరపు, సౌత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాఫ్రికాలోని మిడ్రాండ్లో టీఆర్ఎస్ స్థానిక అధ్యక్షుడు గుర్రాల నాగరాజు పార్టీ జెండాను ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రంగ, గుండా జైవిష్ణు, సాయికిరణ్ నల్ల, నవదీప్‌రెడ్డి, శివారెడ్డి, నామా రాజేశ్వర్, సౌజన్రావు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలతోపాటు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, మారిషస్, తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.