పరకాల, మార్చి 11: హనుమకొండ జిల్లా పరకాలలోని రాజీపేట యువకుడు హిమాలయ పర్వతంపై తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ఏకు చిరంజీవి బెంగళూరులోని మొబైల్ కంపెనీలో థీమ్స్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న హిమాలయ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా వాతావరణ మార్పుల వల్ల 6వ తేదీ వరకు 12,500 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్కాంత పర్వతానికి చేరుకొన్నారు. అక్కడే జాతీయ జెండాను, తెలంగాణతల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించడంతోపాటు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆపాలనే సందేశాన్ని ఇచ్చారు.