హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 612 మంది విద్యార్థులకు ఈ నెల 11న రవీంద్రభారతిలో మహత్మా జ్యోతిబాఫూలే ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్టు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ప్రకటించింది.
రాష్ట్రంలో 612 మండలాల్ల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మండల టాపర్లుగా నిలిచిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు సంఘం అధ్యక్షప్రధాన కార్యదర్శులు కే కృష్ణుడు, లక్ష్మణ్గౌడ్లు తెలిపారు.