Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
Philippines : ఫిలిప్పైన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలిప్పైన్స్ సైన్యానికి చెందిన రెండు శిక్షణ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు మరణించారు.
Philippines : ఫిలిప్పైన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫిలిప్పైన్స్ సైన్యానికి చెందిన రెండు శిక్షణ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలట్లు మరణించారు. ఈ ఘటన ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ వద్ద శుక్రవారం జరిగింది. స్థానిక బటాంగాస్ ప్రావిన్స్‌లోని ఫెర్నాండో ఎయిర్ బేస్ సమీపంలో ఎస్ఎఫ్-260 అనే రెండు యుద్ధ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ సమయంలో రెండు విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు మరణించారు.
విమానాలు ఢీకొని ఎయిర్ బేస్ ప్రాంతంలోనే కూలిపోయాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పైలట్ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ విమానాలు పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు వాడుతారు. ఈ ఘటన తర్వాత ఎస్ఎఫ్-260 యుద్ధ విమానాల్ని ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ విభాగం నిలిపివేసింది. తాత్కాలికంగా విమాన సేవల్ని నిలిపివేసినట్లు తెలిపింది. విమాన ప్రమాదంపై విచారణ జరుగుతోందని సైనిక విభాగం వెల్లడించింది. విమానాలు ఢీకొనడానికి గల కారణాలపై దర్యాప్తు బృందం విచారణ జరుపుతోందని వివరించింది.
ఈ ఘటనకు సంబంధించి పైలట్లు శిక్షణలో ఉన్నారని, వారు మరణించడం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎస్ఎఫ్-260 యుద్ధ విమానాలు గతంలో కూడా ప్రమాదాలకు గురయ్యాయి. గత మేలో ఎస్ఎఫ్-260 యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. అంతకుముందు 2023లో కూడా ఎస్ఎఫ్-260 టీపీ మార్చెట్టి అనే విమానం కూడా కూలిపోయింది. ఈ ఘటనలో కూడా ఇద్దరు పైలట్లు మరణించారు. ఫిలిప్పైన్స్‌లో ఈ విమానాలు తరచూ ప్రమాదాలకు గురి కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

