MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
mla sunitha lakshma reddy వెల్దుర్తి మండల కేంద్రంలోని మాసాయిపేటలో ఎండిన వరి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని బ్లాక్ బుక్స్‌ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు.
MLA Sunitha lakshma Reddy | వెల్దుర్తి, అక్టోబర్ 24 : విద్యుత్ సమస్యలతో ఎండిపోతున్న వరి పంటలను చూసి రైతుల కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని మాసాయిపేటలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఎండిన వరి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే.. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని బ్లాక్ బుక్స్‌ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. విద్యుత్ సరఫరా, అంతరాయాలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. విద్యుత్ సమస్యల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
జాతీయ రహదారిపై ధర్నాతో భారీగా నిలిచిన వాహనాలు
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నాయకులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Mla Sunitha Lakshma Reddy
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

