Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
Prashant Neel | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సినిమా అప్డేట్స్ అందాయి. ‘కల్కి’ సీక్వెల్ నుంచి ‘ఫౌజీ’ వరకు పలు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ‘సలార్ 2’ గురించి కూడా ఓ కీలక అప్డేట్ వచ్చినట్లు సమాచారం.
Prashant Neel | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సినిమా అప్డేట్స్ అందాయి. ‘కల్కి’ సీక్వెల్ నుంచి ‘ఫౌజీ’ వరకు పలు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రానున్న ‘సలార్ 2’ గురించి కూడా ఓ కీలక అప్డేట్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ వార్త ఆసక్తిని పెంచుతోంది.‘418’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘418’ సినిమా పూర్తిగా హారర్ కథాంశంతో తెరకెక్కుతోందా అని ప్రభాస్ ప్రశ్నించగా, ప్రశాంత్ నీల్ సరదాగా స్పందించారు. ‘‘అవునన్నా.. దీన్ని కూడా ‘రాధేశ్యామ్’లా తీస్తే బాగోదు కదన్నా’’ అంటూ చమత్కరించారు. దీనికి ప్రభాస్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘‘పంచ్ వేశావా.. ‘సలార్ 2’ షూటింగ్లో నీ సంగతి చెబుతా’’ అని అన్నారు. ఈ సరదా సంభాషణలోనే ప్రభాస్ అసలు విషయాన్ని ప్రస్తావించారు. ‘‘సలార్ 2 ఎప్పుడు? అదే నువ్వు ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్’’ అంటూ ప్రశాంత్ నీల్‌ను అడిగారు. దీనికి ఆయన జూన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో చేయనున్న ‘సలార్ 2’పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్‌లో షూటింగ్ ప్రారంభమైతే ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగానే ప్రత్యేకమైన కానుక కానుంది.
అయితే షూటింగ్ ప్రారంభ తేదీ, షెడ్యూల్ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది జూన్ చివర్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశంపై చర్చ జరుగుతోంది. 2023 డిసెంబర్ 22న విడుదలైన ‘సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ దేవ పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ పాత్రలో నటించారు. ఖాన్సార్ అనే కల్పిత సామ్రాజ్యం నేపథ్యంలో స్నేహం, అధికారం, పోరాటాల చుట్టూ కథ సాగుతుంది. మొదటి భాగం చివర్లో వదిలిన ప్రశ్నలకు సమాధానాలు సీక్వెల్లో లభిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

