హనుమకొండ, నవంబర్ 17: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అటానమస్లో పీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈనెల 19న ఉదయం 11 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు వారి డిగ్రీ సబ్జెక్టులలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు ఉన్నవారు అర్హులని, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పీజీ కోర్సులలో ప్రవేశం కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జతల జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలన్నారు.
స్పాట్ రౌండులో ప్రవేశం పొందిన అభ్యర్థులకు స్కాలర్షిప్ సౌకర్యం (ఫీజు రీఎంబర్స్మెంట్ )ఉండదన్నారు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ , ఎంఏ ఎకనామిక్స్, ఎంకాం జనరల్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ , ఎమ్మెస్సీ బాటని, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయని, మరిన్ని వివరాలకు పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.