వాషింగ్టన్: అమెరికాలో ఓ చీడ పురుగు కలకలం సృష్టిస్తున్నది. ఎమరాల్డ్ యాష్ బోరర్ (అగ్రిలస్ ప్లానిపెన్నిస్) అనే పురుగు 2050 నాటికి అమెరికాలో దాదాపు 12.6 లక్షల చెట్లను చంపేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 6 వేల నగరాల్లో యాష్ చెట్లపై ఈ పురుగు ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దేశం మొత్తం ఒకే జాతి మొక్కలను పెంచడం సరికాదనే విషయం అధ్యయనం ద్వారా తెలుస్తున్నదని కెనడాలోని మెక్గిల్ వర్సిటీకి చెందిన పర్యావరణవేత్త ఎమ్మా హడ్గిన్స్ పేర్కొన్నారు.