Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే వధూవరులు అందంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చర్మ సంరక్షణ, వ్యాయామం, బరువు తగ్గించే కార్యక్రమాలు, పోషకాహార సప్లిమెంట్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలో నాజూకైన శరీరం, మెరిసే చర్మం పొందాలనే ఒత్తిడి కారణంగా కొందరు ప్రమాదకరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.
Weight Loss Medicine | భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే వధూవరులు అందంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చర్మ సంరక్షణ, వ్యాయామం, బరువు తగ్గించే కార్యక్రమాలు, పోషకాహార సప్లిమెంట్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలో నాజూకైన శరీరం, మెరిసే చర్మం పొందాలనే ఒత్తిడి కారణంగా కొందరు ప్రమాదకరమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న మౌంజారో, వెగోవీ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు, గ్లూటథయోన్ డ్రిప్స్, డీటాక్స్ టీలు, కఠినమైన ఆహార నియమాలు తక్షణ ఫలితాలిస్తాయని చెబుతున్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం..
మౌంజారో, వెగోవీ ఇంజెక్షన్లు వైద్యుల సూచనతో మాత్రమే వాడాల్సిన మందులు. పెళ్లి కోసం త్వరగా బరువు తగ్గేందుకు వీటిని ఉపయోగించడం సురక్షితం కాదు. వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, శరీరంలో నీటి శాతం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. వేగంగా బరువు తగ్గడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం, కండరాల బరువు తగ్గడం వంటి ప్రమాదాలూ ఉన్నాయి. అలాగే చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుందని ప్రచారం చేస్తున్న గ్లూటథయోన్ ఇంజెక్షన్ల వల్ల అలర్జీలు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డ్రిప్స్, ఎన్ఏడీ ఇన్ఫ్యూషన్లు కూడా ఆరోగ్యవంతుల్లో అదనపు ప్రయోజనాలు ఇస్తాయని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవు. అనవసరంగా ఇలాంటి చికిత్సలు తీసుకుంటే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శరీరంలో ద్రవాలు, లవణాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది.
డీటాక్స్ టీలతో దుష్ప్రభావాలు..
డీటాక్స్ టీలు, సన్నబడే టీలు శరీరంలోని కొవ్వును తగ్గించకపోయినా, విరేచనాలు లేదా మూత్ర విసర్జన పెంచి తాత్కాలికంగా బరువు తగ్గినట్లు చూపిస్తాయి. వీటిని తరచూ వాడితే నీరసం, లవణాల అసమతుల్యత, గుండె, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. పెళ్లికి ముందు ఆహారం పూర్తిగా తగ్గించడం, కేవలం పండ్ల రసాలు లేదా సలాడ్లతో రోజులు గడపడం వల్ల పోషకాహార లోపం, కండరాల నష్టం, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చివరి నిమిషంలో బొటాక్స్, ఫిల్లర్లు, రసాయన చికిత్సలు, లేజర్ ప్రక్రియలు చేయించుకోవడం వల్ల వాపు, మచ్చలు, ఇన్ఫెక్షన్లు, అరుదైన సందర్భాల్లో చూపు దెబ్బతినడం వంటి ప్రమాదాలుంటాయి. బయోటిన్ వంటి సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వైద్య పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.
వైద్యుల సలహా లేకుండా వద్దు..
బయటకు కనిపించే అందం కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నెలసరి వాయిదా వేసే మాత్రలను కూడా వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. రక్తం గడ్డకట్టే సమస్యలు, మైగ్రేన్, అధిక రక్తపోటు ఉన్నవారికి కొన్ని హార్మోన్ల మందులు సరిపోవు. యోని శుద్ధి కోసం ఆవిరి పట్టించడం వల్ల కాలిన గాయాలు, మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. యోని సహజంగానే తనను తాను శుభ్రం చేసుకుంటుంది కాబట్టి ప్రత్యేక శుద్ధి చికిత్సలు అవసరం లేదు. పెళ్లికి సిద్ధమయ్యే సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, మందులు లేదా సౌందర్య చికిత్సలు ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అందం కోసం చేసే ప్రయత్నాలు ఆరోగ్యానికి ముప్పుగా మారకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

