దేవరకద్ర, నవంబర్ 16 : 55 ఏండ్లు అధికారమిస్తే అభివృద్ధిపై సోయిలేకుండా పాలమూరును కరువు జిల్లాగా మార్చి వలసలకు నిలయంగా మార్చిందని, అట్లాంటిది ఇప్పుడొచ్చి ఒక్క అవశామివ్వాలని అడుగడం సిగ్గుచేటని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం మండలంలోని గోపన్‌పల్లి, నార్లోనికుంట, బస్వాపూర్, పెద్దరాజమూర్, నాగారం, బలుసుపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపన్‌పల్లిలో బీటీ రోడ్డుతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెం చేలా చర్యలు తీసుకున్నామన్నారు.
పదేండ్ల కిందట సాగునీరు లేక భూములన్నీ బీడు గా ఉండగా, నేడు సంబురంగా రైతు సాగు చేసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, గ్యారెంటీలేని హామీలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలకతీతంగా పనిచేశామని, సంక్షేమ పథకం అందని ఇల్లే లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రజితారెడ్డి, హన్మంతు, సరోజ, ఎంపీపీ రమాదేవి, ఎంపీటీసీ ఆంజనేయులు, సహకార సంఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్‌రెడ్డి, ముడా డైరెక్టర్ రాజు, రైతుసమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డ్డి, నాయకులు అరుణ, శ్రీనివాస్, శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల) నవంబర్ 16 : కౌకుంట్ల మండల కేంద్రంతోపాటు పుట్టపల్లి, రాజోళి గ్రామాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.