తాండూర్ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు(Sridevi) అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని చౌటపల్లి గ్రామ సర్పంచ్ తోపాటు వార్డు సభ్యులను శుక్రవారం ఆమె సన్మానించారు.
సర్పంచ్ ముదాం సునీత, ఉపసర్పంచ్ గంగాధర లక్ష్మణ్, వార్డు సభ్యులు కోట భాగ్యలక్ష్మి, జూపాక శృతి, బొర్లకుంట రవీనా, అక్కపల్లి జీవన్ కుమార్, దుండ్రా రాజేష్, అర్లకూడ అంజి, సిడాం జ్యోతి లను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు.