Hyderabad | ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పహాడీషరీఫ్: వర్షాల తగ్గే వరకు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబిల్కాలనీ, మెట్రోసిటీ కాలనీలో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడారు. సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని ధైర్యం చెప్పారు.
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ జి.పి కుమార్‌కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ప్రత్యేక పారిశుధ్య సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. మంత్రి వెంట స్థానిక కౌన్సిలర్లు అహ్మద్ కసాది, జాఫర్ భామ్, జింకల రాధిక, శంషోద్ధీన్, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, శ్రావణ్‌కుమార్‌లు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

