టెక్నాలజీస్..హైదరాబాద్‌లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆరంభించింది. హైటెక్ సిటీ వద్ద ఉన్న సైబర్ గేట్‌వేలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆఫీస్‌లో 220 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుంటుంది. 2005లో టెక్నాలజీ సేవలు ఆరంభించిన సంస్థకు ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నంలో సెంటర్లను నిర్వహిస్తున్నది. ఈ రెండు సెంటర్లలో 250 మంది సిబ్బంది పనిచేస్తుండగా..వచ్చే ఏడాదిన్నరలోగా ఈ సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు కంపెనీ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రామ కృష్ణ రాజు తెలిపారు. సంస్థకు చెందిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో నూతన ఆఫీస్‌ను ఆరంభించినట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 250 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, ఆటోమేషన్ టెక్నాలజీతో లెండింగ్, పేమెంట్ ప్రాసెసింగ్, కోర్ బ్యాంకింగ్ సేవలను సంస్థ అందిస్తున్నది. ప్రస్తుతం సంస్థకు భారత్‌తోపాటు మధ్య ప్రాఛ్య, యూరప్ దేశాలకు చెందిన 45 బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్లు క్లయింట్లుగా ఉన్నారు.