Collector B. Satyaprasad | హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలి : కలెక్టర్ బి. సత్యప్రసాద్
Collector B. Satyaprasad | మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్ తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు.
జగిత్యాల : మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్ ( Health Centres ) తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ( Collector B. Satyaprasad ) గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూహెల్త్ సెంటర్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ప్రహరీ, రహదారి వంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం మెట్పల్లి పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి , కోరుట్ల ఆర్డీవోలు నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) సుజాత, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

