Hardeep Singh Puri | పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..? కేంద్ర చమురు శాఖ మంత్రి సమాధానమిదే
Hardeep Singh Puri : ఇరాన్-అమెరికా యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
Hardeep Singh Puri : ఇరాన్-అమెరికా యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదన్నారు. అయితే, కొన్ని వారాలపాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా, తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వం ధరల్ని తగ్గిస్తుందని చెప్పారు.
ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి జూన్ 30 వరకు చమురు కంపెనీలు రూ.74,781 నష్టపోయాయన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాల ద్వారా ఈ మేరకు కంపెనీలు నష్టపోయాయన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కంపెనీలు ఇంకా నష్టాల్లోనే నడుస్తున్నాయన్నారు. కారణం చమురు కంపెనీలు ఇంకా గతంలో కొనుగోలు చేసిన క్రూడాయిల్నే ప్రాసెస్ చేస్తున్నాయన్నారు. కంపెనీలు దాదాపు రెండు నెలల ముందు చమురును కొంటాయని, ప్రస్తుతం శుద్ధి చేస్తున్న చమురును రెండు నెలల క్రితం ఎక్కువ ధరకు కొనుగోలు చేశాయని పూరి తెలిపారు. అందువల్లే ఇప్పుడు ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. అయితే, ఈ అంశంపై బుధవారం సమీక్ష జరిపినట్లు తెలిపారు.
చమురు సరఫరా కోసం కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతున్నామని, రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని అన్నారు. క్రూడాయిల్ శుద్ధి సామర్ధ్యాన్ని సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇండియాలో చమురు ధరలు పెరిగాయి. సగటున లీటర్‌కు రూ.7.50 వరకు పెరిగాయి. ఎల్పీజీ, పీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. ఈ కారణంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి. దీంతో ధరల తగ్గుదల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

