
పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం, పోక్సో కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్జి ప్రియదర్శిని, పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి డీ వరూధిని తదితరులు పాల్గొన్నారు.