Peddi Sudarshan Reddy | నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. విగ్రహ ప్రతిష్ఠ కోసం బీఆర్ఎస్ నాయకులు కొత్తగా సిద్ధం చేసిన గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నాయి.
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయితే ఆ విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. దీంతో మరోచోట విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించి, అందుకు అనుగుణంగా కొత్తగా గద్దెను సిద్ధం చేశారు.
అయితే కొత్తగా ఏర్పాటు చేసిన గద్దెను సైతం అర్ధరాత్రి దొంగల్లా వచ్చి కూల్చివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహ ఏర్పాటుకు సిద్ధం చేసిన గద్దెను ధ్వంసం చేయడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. దివంగత నేతకు గౌరవంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే వరుసగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించాయి.
బ్రేకింగ్ న్యూస్
మరోసారి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డిపై కొనసాగుతున్న కాంగ్రెస్ కుట్రలు
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కోసం మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్చివేయడంతో, మరోచోట… https://t.co/nlhCZjWbKw pic.twitter.com/6FIvRjeqJj
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026