Nayanthara | దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా.. నయనతార క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా కనిపిస్తూ, వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ లేడీ సూపర్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్, బ్యూటీ విషయంలో చాలామందికి ఆసక్తి ఉంటుంది.అయితే నయనతార తన అందం, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి చాలా కఠినమైన డైట్ లేదా గంటల తరబడి వర్కౌట్స్‌పై ఆధారపడదట. తన బిజీ షెడ్యూల్‌కు సరిపోయేలా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
తన శరీరాకృతిని ఫిట్‌గా ఉంచుకోవడానికి నయనతార వెయిట్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుందని సమాచారం. దీనితో పాటు యోగా కూడా ఆమె ఫిట్నెస్ రొటీన్లో కీలక భాగంగా ఉంటుందట. సినిమా షూటింగ్స్ కోసం ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం. అలాంటి సమయంలో యోగా తనకు రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు తిరిగి ఎనర్జీ పొందేందుకు ఉపయోగపడుతుందని నయనతార భావిస్తారట. ముఖ్యంగా సినిమా కోసం మాత్రమే ఫిట్‌గా ఉండటం కాకుండా.. వ్యాయామాన్ని తన రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోవడానికే ఆమె ఇష్టపడుతుందని తెలుస్తోంది.
ఆహారం విషయంలో కూడా నయనతార తన పద్ధతిని మార్చుకున్నారట. గతంలో డైట్ అంటే చాలా కఠినమైన నియమాలు పాటించాల్సిందేనని భావించేవారట. తనకు నచ్చని ఆహారాన్ని కూడా డైట్ పేరుతో తినాల్సి రావడం ఆమెకు ఇష్టం ఉండేది కాదట. అయితే ప్రస్తుతం మాత్రం శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను సరైన మోతాదులో తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారట. నయనతార ఆహారపు అలవాట్లలో మరో ముఖ్యమైన విషయం ఇంట్లో తయారుచేసిన భోజనానికి ఆమె ఇచ్చే ప్రాధాన్యత. ప్రయాణాల్లో ఉన్నా, షూటింగ్ సెట్లో ఉన్నా.. అందుబాటులో ఉన్న ప్రతిదీ తినకుండా వీలైనంత వరకు ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆహారాన్నే తీసుకోవడానికి ప్రయత్నిస్తారట. ఇలా చేయడం వల్ల జంక్ ఫుడ్‌పై వచ్చే క్రేవింగ్స్‌ను కూడా నియంత్రించుకోవచ్చని భావిస్తారట. ఆమె ఆహారంలో పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలు ఉంటాయని సమాచారం.
ఫిట్నెస్తో పాటు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడంపైనా నయనతార ప్రత్యేక శ్రద్ధ పెడతారట. ఎక్కువగా నీరు తీసుకోవడంతో పాటు గ్రీన్ టీ, తాజా జ్యూస్‌లు, సూప్‌లను కూడా తన ఆహారంలో భాగంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.బిజీ షూటింగ్ షెడ్యూల్, వర్కౌట్స్ కారణంగా శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరమే. అందుకే నిద్ర విషయంలోనూ ఆమె రాజీ పడరట.రోజూ సరిపడా నిద్రపోవడం కూడా తన ఫిట్నెస్ రొటీన్లో ముఖ్యమైన భాగంగా నయనతార భావిస్తారట. సాధ్యమైనంత వరకు 8 గంటలకు పైగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.