పెద్దపల్లి రూరల్, జూన్ 20 : దోపిడీ దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ (Peddapalli) ఎస్ఐ బీ. మల్లేశ్ అన్నారు. పెద్దపల్లి మండల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైందని, దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల అనుక్షణంగా జాగరూతతో ఉండాలన్ని సూచించారు. పోలీసులకు సమాచారం అందిస్తేతగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గ్రామాలలో పార్థి గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ గ్రామాలలో గస్తీ ఏర్పాటు చేసుకొని అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినట్లయితే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి దొంగల పని పడతామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట, రాఘవాపూర్ గ్రామాల్లో జరిగిన దొంగతనాల విషయంలో అప్రమత్తత చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. పోలీసు పెట్రోలింగ్ కూడా చేస్తున్నామని, ఎలాంటి అనుమానాస్పద సమాచారం తెలిసినా, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేయాలన్నారు.