హనుమకొండ చౌరస్తా : కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల ( Schools ) కుదింపునకు నిరసనగా ఈనెల 15న ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ఎదుట జరిగే ధర్నా( Dharna )ను విజయవంతం చేయాలని పీడీఎస్యూ ( PDSU ) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి రావడానికి మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఉన్న పాఠశాలలను కుదించడం అన్యాయమని అన్నారు. ఉపాధ్యాయుల కొరత, మరుగుదొడ్లు, సరైనా బిల్డింగ్స్, కనీస సమస్యలను ఏమాత్రం మెరుగుపరుచకుండా 4 వేల పాఠశాలలకు కుదించడం పేద విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయడమే నన్నారు.
ప్రభుత్వాలు విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను పెంచి పోషించుకుంటుందని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రేవంత్ సర్కార్ నియంత్రించాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు వంగెటి మోహన్, రమణ, బన్నీ, ఎండి.ఫర్హాన్, సంపత్, యూనివర్సిటీ నాయకులు రాజేష్, రాంబాబు, వెంకటేష్ పాల్గొన్నారు.