Supriya Sule | ఆ వార్తల్లో నిజం లేదు.. కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం వార్తలను ఖండించిన సుప్రియా సూలే
Supriya Sule | శరద్‌పవార్ (Sharad Pawar) వర్గం ఎన్సీపీ (NCP).. కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అవి ఊహాగానాలని ఎన్సీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) ఖండించారు. తమ పార్టీకి కాంగ్రెస్ నుంచి ఎలాంటి విలీన ప్రతిపాదన రాలేదని, తమ తరఫున కూడా అలాంటి ప్రతిపాదన పంపలేదని స్పష్టంచేశారు.
Supriya Sule : శరద్‌పవార్ (Sharad Pawar) వర్గం ఎన్సీపీ (NCP).. కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందంటూ ఇటీవల వచ్చిన వార్తలు మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, అవి ఊహాగానాలని ఎన్సీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) ఖండించారు. తమ పార్టీకి కాంగ్రెస్ నుంచి ఎలాంటి విలీన ప్రతిపాదన రాలేదని, తమ తరఫున కూడా అలాంటి ప్రతిపాదన పంపలేదని స్పష్టంచేశారు. ఈ చర్చ ఎక్కడి నుంచి మొదలైందో తనకు తెలియదన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు కూడా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మధ్య జరిగిన సమావేశం నేపథ్యంలో కూడా విలీనాలపై జాతీయస్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భేటీలో ఏం చర్చించారో తనకు తెలియదని సూలే పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆ ఇద్దరు నేతలు మాత్రమే ఉన్నారని, అందులో విలీనానికి సంబంధించిన అంశాలు చర్చించారా లేదా అనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. దేశ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ లెక్కల కంటే ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూలే అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీట్ పరీక్ష వ్యవహారంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని అన్నారు. అధికార కూటమిపై కూడా సూలే విమర్శలు గుప్పించారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

