హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): యాదవ, కురుమల వృత్తిని తూలనాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆ కులాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేవారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘పేడ పిసికేవారు, దున్నపోతులను కడిగేవారు’ అని రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
యాదవ, కురుమలకు పేడ పిసకడం తెలుసు.. నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పీక పిసకటం తెలుసు’ అని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున అందోళన చెపడతామని స్పష్టంచేశారు. యాదవ, కురుమల ఆడబిడ్డలతో రేవంత్‌రెడ్డిని చెప్పులు, చీపుర్లతో కొట్టిస్తామని హెచ్చరించారు.