Jyothi Krishna | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన హరిహరవీరమల్లు పార్ట్-1 జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్‌తో స్క్రీనింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.
హరిహరవీరమల్లు లో మొఘలుల కాలంలో హిందూ దేవాలయాలను ఎలా దెబ్బతీశారో చూపించడంపై ప్రశంసలు అందుతున్నాయి. వేదగ్రంథాలు నాశమైనప్పుడు వీరమల్లు (పవన్ కళ్యాణ్) అన్ని అడ్డంకులను ఎదుర్కొని మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. వీరమల్లు తనను తాను వేద పండితుడిగా మార్చుకుని.. అన్ని వేద పుస్తకాలను అర్థం చేసుకున్నాడు. వీరమల్లు ఒక ఆలయంలో పెరిగాడు. అతనికి చిన్నతనంలో అన్ని రకాల వేద జ్ఞానాన్ని అందించిన నేపథ్యంలో చివరకు ఓ అద్భుతమైన శక్తిగా మారతాడని చెప్పాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.
వేద సూత్రాల్లో మిళతమైన వాస్తు శాస్త్రంలోని ఐదు అంశాలలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నుండి సామరస్యపూర్వకమైన జీవన వాతావరణాన్నిసృష్టించడానికి వీర మల్లు తన జ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటాడో తెలిపాడు. వీరమల్లు నైపుణ్యం, విషయాలను ముందుగానే ఊహించే సామర్థ్యం ఎవరికీ తీసిపోనివి. ఉదాహరణకు, వీరమల్లు కొండచరియల వద్ద గుల్ఫామ్ ఖాన్ (కబీర్ దుహాన్ సింగ్)పై కొండచరియలు విరిగిపడకుండా కాపాడతాడు.
వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఓ గ్రామంలో కరువును అంతం చేయడానికి చేస్తున్న వరుణ యాగానికి ఎలాంటి ఆంటకాలు లేకుండా చేస్తాడు. ప్రేమ, కరుణ, అహింస ద్వారా జంతువులతో కనెక్ట్ అవ్వాలనే వీర మల్లు నమ్మకం వేద ఆలోచన నుండి ఉద్భవించిందంటూ చెప్పుకొచ్చాడు జ్యోతికృష్ణ.
శ్రీరాముడు అయోధ్య నుండి లంకకు చేసే తన ప్రయాణంలో వివిధ ప్రదేశాల మీదుగా ప్రయాణించాడు. కాబట్టి రామాయణ కథ ఈ ప్రదేశాలతో ముడిపడి ఉంది. అదే లైన్లో గోల్కొండ నుండి ఢిల్లీ సుల్తానేట్ (దక్షిణం నుండి ఉత్తరం వరకు) వీరమల్లు చేసిన యాత్ర వేద సూత్రాల ద్వారా మంచి పనులతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ప్రయాణం. వీరమల్లు సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తాడో వివరించేందుకు మేం చరిత్ర, పురాణాలను మిళితం చేశాం. వీరమల్లు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రయాణ సమయంలో అతను చేసిన మంచి పనులు రాముడి ప్రయాణానికి దగ్గరగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి