బడంగ్‌పేట, జూలై 16 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12,13 డివిజన్ల పరిధి చింతలకుంట, బృందావన్, ప్రశాంత్‌నగర్‌లో రూ.1.8కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బోనాల సందర్భంగా మీర్‌పేట దేవాలయాలకు మంజూరైన రూ.11.30లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే మీర్‌పేట అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు మరో రూ.2.40కోట్లు కేటాయించారన్నారు. పెద్ద చెరువు లైటింగ్‌కు రూ.25లక్షలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రూ.1.50కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.