
హరిద్వార్: దేశంలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారార్థం పతంజలి ఆయుర్వేద్ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ‘నవ హరిత క్రాంతి-ఓ వ్యవసాయ విజన్’ పేరుతో ఆవిష్కరించిన పుస్తకంలో ఈ పరిష్కారాలను సూచించింది. ఆర్గానిక్ వ్యవసాయం కోసం శిక్షణ, మేలురకం విత్తనాలు, చౌక ధరల ఎరువులు రైతులకు లభించేలా సహకారం ఇస్తున్నది.