డేటా సెక్యూర్టీపై ట్విట్టర్ అధికారుల్ని ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ: డేటా సెక్యూర్టీ, ప్రైవసీ అంశాలపై ఇవాళ సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ సంస్థ అధికారుల్ని పార్లమెంటరీ ప్యానల్ ప్రశ్నించింది. భారత్‌లో జరుగుతున్న ఆపరేషన్స్‌పై ఇటీవల ఆ కంపెనీ ఉన్నతోద్యోగి కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. ఆ విజిల్ బ్లోయర్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంటరీ ప్యానెల్ ట్విట్టర్ అధికారుల్ని నిలదీసింది. డేటా సెక్యూర్టీ, ప్రైవసీ గురించి ప్రశ్నించింది. ట్విట్టర్ తీరు సంతృప్తికరంగా లేదని ప్యానెల్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులు ఆ విజిల్ బ్లోయర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇండియాలో ఎటువంటి డేటా సెక్యూర్టీ ఉల్లంఘన జరగలేదని అన్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఐటీ విభాగం చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. ట్వట్టర్ ఎగ్జిక్యూటివ్‌లు సమిరన్ గుప్తా, డైరెక్టర్ షాగుఫ్తా కమ్రాన్‌లు ఈ విచారణకు మాజరయ్యారు. పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యులైన శశిథరూర్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సీపీఐ ఎంపీ జాన్ బ్రిటాస్‌లు మీటింగ్‌కు హాజరయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

