న్యూఢిల్లీ, జనవరి 27 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది.
ఈ సందర్భంగా వివిధ విపక్షాలకు చెందిన నేతలు మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, ఓటర్ల జాబితాను సవరించేందుకు చేపట్టిన ‘సర్’ ప్రక్రియ, భారత విదేశాంగ విధానం, వివాదాస్పదమైన యూజీసీ కొత్త మార్గదర్శకాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను, సర్‌పై విస్తృత చర్చను ప్రభుత్వం తోసిపుచ్చింది.