వనపర్తి టౌన్, జూలై 14 : ‘కాంగ్రెస్ కోసం అప్పట్లో పాదయాత్ర చేశాను.. ప్రాయశ్చిత్తంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా’..అని వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త పానుగంటి రాము అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలకు ప్రజాపాలన అందించాలని పాదయాత్రతో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నానని కానీ నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతులను, మహిళలను, నిరుద్యోగులను, కార్మికులను, విద్యార్థులను నిర్లక్ష్యం చేసి సంక్షేమ పథకాలు అమ లు చేయకుండా రోజుకో ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతు లు సుభిక్షంగా ఉన్నారని కానీ నేడు కాంగ్రెస్ హ యాంలో రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, యూరియా, కరెంట్ కోతలతో, ధాన్యానికి మద్దతు ధర, బోనస్ లేక అప్పుల పాలవుతున్న రైతుల బాధ లు వర్ణణాతీతమని రాము వాపోయారు.
మేఘారెడ్డి మాటలు నీటి మూటలు..
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి పనిచేస్తున్న మమ్మల్ని విస్మరించి ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నాయకులకు పదవులు ఇస్తూ గ్రామంలో వారి మాటకు ప్రాధాన్యం ఇవ్వడంపై మేము మనోవేదనకు గురవుతున్నామని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సారథ్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మి మండల నాయకుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీలో చేరామని రాము స్పష్టం చేశారు.
రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్దే అధికారం
అనంతరం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాబో యే రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ అబద్ధపు హామీ లు, గ్యారెంటీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుం డా పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని వారిని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ముందుగా పానుగంటి రాముతో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గొర్ల రాము, కొమ్ము నాగయ్య, రాము, కురుమయ్య, భగవంత్, నరేశ్, అభిషేక్, చరణ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు వాకిటి శ్రీధర్, మాణిక్యం, ధర్మానాయక్, మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, ధర్మ శాస్త్రి, భగవంతుయాదవ్, శంకుద్దీన్, అంజి, సత్యనారాయణచారి తదితరులు ఉన్నారు.