హెచ్ఎండీఏలో మరో అవినీతి అధికారి
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చారు. ఈసారి చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు గుర్తించి.. మంగళవారం ఉదయం అతడి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
- చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు
- నిజామాబాద్, మెదక్, హైదరాబాద్‌లో తనిఖీలు
- 11 చోట్ల సోదాల్లో రూ.70 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చారు. ఈసారి చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు గుర్తించి.. మంగళవారం ఉదయం అతడి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు రవీందర్‌తోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన ఇండ్లు, కార్యాలయాలు సహా 11 ప్రదేశాల్లో తనిఖీ చేశారు.
హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్‌లో జరిగిన ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. రూ.9.24 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.70 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణతో)లోని సెక్షన్ 13(1)(బీ), 13(2) ప్రకారం అతడిని అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. 14రోజుల రిమాండ్ విధించారు.
ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు..
- కొండకల్, కిష్టాపూర్, పాసమలలో రూ. 38,89,700 విలువైన 5 ప్లాట్లు
- నార్సింగి, నానక్‌రామ్‌గూడలో రూ. 2,07,40,000 విలువైన 4 ఫ్లాట్లు
- కొత్తూరు మండలం గూడూరు, శంషాబాద్‌లో రూ.60 లక్షల విలువైన 4 ఎకరాల భూమి
- శంకర్పల్లి మండలం, మోకిల, శ్రీవారి మెడోస్‌లో రూ. 1,33,58,800 విలువైన 300 చదరపు గజాల విల్లా
- కొండాపూర్‌లోని మసీద్ బండ వద్ద రూ. 3 కోట్ల విలువైన 300 చదరపు గజాల జీ+4 భవనం
- రూ.3,82,000 నగదు స్వాధీనం
- రూ.45,05,776 బ్యాంక్ బ్యాలెన్స్
- 1,440 గ్రాముల రూ. 36,70,000 విలువైన బంగారు ఆభరణాలు
- 12.5 కిలోల రూ.10 లక్షల విలువైన వెండి ఆభరణాలు
- రూ.17,24,000 విలువైన గృహోపకరణాలు
- రూ.9,32,000 విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
- రూ.1,16,00,000 విలువైన 4 వాహనాలు (ఇన్నోవా రూ.40 లక్షలు, టాటా సఫారీ రూ.31లక్షలు, ఇన్నోవా క్రిస్టా రూ.25 లక్షలు, మహీంద్రా ఎక్స్‌యూవీ రూ. 20, లక్షలు)లను గుర్తించారు. ఆస్తుల విలువ రూ. 9, 24, 02,276 ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేయగా.. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

