ఇస్లామాబాద్ : ఫతహ్ మిస్సైల్(Fatah missile)ను ఇవాళ పాకిస్థాన్ పరీక్షించింది. ఈ మిస్సైల్ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగలదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఈ క్షిపణి పరీక్ష గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ క్షిపణిలో ఉన్న గైడెన్స్ సిస్టమ్ దీని రాకెట్‌ను అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా చేస్తుంది. ఇక ట్రాజెక్టరీ మోడ్, టర్మినల్ గైడెన్స్ టెక్నాలజీ దీన్ని యాంటీ బాలిస్టిక్ క్షిపణి తరహా వ్యవహరించేలా చేస్తుంది. సీనియర్ ఆర్మీ ఆఫీసర్లు పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించారు. పాకిస్థాన్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
శనివారం రోజున అబ్దలి మిస్సైల్‌ను పాకిస్థాన్ పరీక్షించిన విషయం తెలిసిందే.