న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సూపర్8 స్టేజ్‌కు ఆ జట్టు అర్హత సాధించలేదు. అమెరికా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో.. పాకిస్థాన్ వెనుకబడిపోయింది. గ్రూప్ ఏ నుంచి ఇండియా, అమెరికా సూపర్8కి ప్రవేశించాయి. అయితే పాక్‌కు ఇంకో మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉన్నా.. ఆ జట్టుకు రెండు పాయింట్లే ఉండడంతో సూపర్8 ఛాన్సు మిస్సైంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేవలం ఒకే ఒక లైన్లో అక్తర్ ఓ కామెంట్ పోస్టు చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జర్నీ ముగిసిందని అక్తర్ కామెంట్ చేశారు. ఒకవేళ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిస్తే, అప్పుడు పాక్ తన తదుపరి మ్యాచ్‌పై ఆధారపడి ఉండేది. కానీ డ్రా కావడంతో చెరో పాయింట్ దక్కింది. దీంతో పాక్ ఆశలకు గండి పడింది.
Pakistan’s World Cup journey is over.
— Shoaib Akhtar (@shoaib100mph) June 14, 2024