కాల్వ శ్రీరాంపూర్ నవంబర్ 4 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో మడిపల్లి, అంకంపల్లి, ఆశన్నపల్లి, మడిపల్లి కాలనీ, పెగడపల్లి, పెద్దంపేట్, లక్ష్మీపురం, ఆరేపల్లి, ఇప్పలపల్లి, మీర్జంపేట, కిష్టంపేట మోట్లపల్లి చిన్న రాత్పల్లి, పెద్ద రాతిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసిల్దార్ జగదీశ్వర్ రావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో డిటి శంకర్, సీఈఓ కోలేటి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, వైస్ చైర్మన్ కామిడి సంధ్య వెంకటరెడ్డి, విండో డైరెక్టర్లు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.