చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలు.. బెంగళూరులో 470 మంది గుర్తింపు
బెంగళూరు : ఇప్పటివరకు పెద్దవారిలోనే కనిపించిన కరోనా వైరస్ మహమ్మారి.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లుగా కనిపిస్తున్నది.

బెంగళూరు : ఇప్పటివరకు పెద్దవారిలోనే కనిపించిన కరోనా వైరస్ మహమ్మారి.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లుగా కనిపిస్తున్నది. ఇప్పుడు పెద్ద వయసు వారితోపాటు చిన్నారుల్లో కూడా కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.
బెంగళూరులో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్నది. మార్చి 1 నుంచి బెంగళూరులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 470 మంది పిల్లలు కొవిడ్ -19 బారిన పడ్డట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.మొత్తం మందిలో 244 మంది బాలురు, 228 మంది బాలికలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఈ నెల ప్రారంభ రోజుల్లో పిల్లల్లో కేసులు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చేవి. అయితే, అవి మార్చి 26 వరకు క్రమంగా పెరుగుతూ 46 కి చేరాయి.
కొంతమంది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గతంలో మాదిరిగా కాకుండా పిల్లలు ఇప్పుడు బహిరంగ కార్యకలాపాలు, విధులు, సమావేశాలకు హాజరవుతున్నందున వీరు కొవిడ్‌కు గురవుతున్నారు. లాక్‌డైన్ ముగిసి పరిస్థితులు సద్దుమణగడంతో ఒక నిర్దిష్ట వయస్సు వారి కోసం పాఠశాలల్ని తిరిగి తెరిచారు. దాంతో చాలా మంది స్కూలుకు వెళ్లడం, ఇంటికి రావడంతో వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు.
పెద్ద వారు ఉద్యోగాలకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో మార్గదర్శకాలు పాటించకుండా ప్రజలు తిరుగుతుండటం వల్ల చిన్నారులకు వైరస్ సోకుతున్నదని కర్ణాటక రాష్ట్ర కొవిడ్ -19 సాంకేతిక సలహా కమిటీ సభ్యుడు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ గిరిధర్ బాబు చెప్తున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదా ఇతరుల నుంచి వైరస్ బారిన పడటం, కుటుంబ సభ్యులు, స్నేహితులు వంటి ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. పిల్లలు శారీరక దూరాన్ని పాటించడంతోపాటు ఎక్కువ సమయం మాస్కులు ధరించలేరు, కాబట్టి పిల్లలు కూడా సులభంగా వైరస్‌కు గురవుతున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రస్తుతం పాఠశాలకు వెళ్లకపోయినా, ఆట స్థలాలు లేదా పార్కులు వంటి బహిరంగ ప్రాంతాల్లోని కార్యకలాపాల సమయంలో ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘మన్ కి బాత్’ లో మన మిథాలికి మోదీ ప్రశంస
అంతా పబ్లిక్ చేయకూడదు: శరద్ పవార్‌తో భేటీపై అమిత్‌షా
లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత
ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

