న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ద్వారక జిల్లాలోని మోహన్ గార్డెన్ ఏరియాలో ఇవాళ ఉదయం 17 ఏండ్ల పాఠశాల విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి ఘటన కలకలం రేపుతున్నది. ప్రస్తుతం బాధితురాలు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, అయితే ముఖంపై యాసిడ్ గాయాలు అయ్యాయని చెప్పారు.
ఇవాళ ఉదయం తన బిడ్డలు ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్తుండగా.. ఇద్దరు బాలురు ముఖాలకు ముసుగులు వేసుకుని వచ్చారని, వచ్చీరావడంతోనే పెద్ద బిడ్డపై యాసిడ్ దాడి చేశారని, ఈ విషయాన్ని తన చిన్న బిడ్డ పరుగున ఇంటికి వచ్చి తమకు చెప్పిందని బాధితురాలి తండ్రి చెప్పారు. తన బిడ్డ రెండు కండ్లలో యాసిడ్ పడిందని చెబుతూ ఆయన విలపించారు.