ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 1వ తేదీ నుంచి, బీఈ ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి, బీఏఎస్ఎల్పీ మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inను చూసుకోవచ్చని సూచించారు.
వాయిదా పడిన పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొహరం పండుగ సెలవును గురువారం నుంచి శుక్రవారానికి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షలను ఓయూ వాయిదా వేసింది. బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబీఏ (టెక్ మేనేజ్మెంట్), ఎండీహెచ్ఎం, ఎంబీఏ (ఈవినింగ్) తదితర కోర్సుల పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఓయూ వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు.