వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ (ఫారెస్ట్రీ) మొదటి, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 26వ తేదీ నుంచి, బీపీఈడీ, డీపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, రెండో, మూడో, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు చూసుకోవచ్చని సూచించారు.
బీఏఎస్ఎల్పీ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచ్‌లర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్ఎల్పీ) ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఏఎస్ఎల్పీ ఆరో సెమిస్టర్ పూర్తి చేసిన వారు ఈ (నాలుగో సంవత్సరం) ఇంటర్న్‌షిప్‌లో చేరేందుకు అర్హులని చెప్పారు. దీనికి సంబంధించిన ఫీజులు, ఇతర వివరాల కోసం ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
వాయిదా పడిన ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీ ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొహరం పండుగ సెలవును గురువారం నుంచి శుక్రవారానికి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షలను ఓయూ వాయిదా వేసింది. దీంతో ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షను తిరిగి ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి తేడా ఉండబోదని స్పష్టం చేశారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 19: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు చూసుకోవచ్చు.