మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరిన ప్లేయర్లు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్‌ను తరలించవద్దని పలువురు జాతీయస్థాయి ప్లేయర్లు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. శనివారం మంత్రిని కలుసుకున్న వారు హాస్టల్ సమస్యపై వివరించారు. యూనివర్సిటీలో ప్రస్తుతమున్న స్పోర్ట్స్ హాస్టల్‌ను లేడిస్ హాస్టల్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన..యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌తో మాట్లాడారు. రాష్ట్రం తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్ల కోసం హాస్టల్‌ను యథావిధిగా కొనసాగించాలని సూచించారు. మంత్రిని కలుసుకున్న వారిలో ప్లేయర్లతో పాటు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.