ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 15: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ‘ఎమర్జింగ్ అండ్ అ డాప్టబుల్ టెక్నాలజీస్ ఇన్ ప్రాసెస్ ఇం డస్ట్రీస్’పై రెండు రోజుల జాతీయ సద స్సు నిర్వహించారు. కళాశాలలోని రీసె ర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్-హైదరాబాద్ రీజనల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు ముగింపు కార్యక్ర మం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీవీ బసవరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక నవీకరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేథ, ప్రాసెస్ ఇంటెన్సిఫికేషన్ రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని చెప్పారు.
మనిషికి ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ఔషధాలను ఒక చోట కుప్ప పోస్తే అదే తమ కళాశా ల అని అన్నారు. ఈ కళాశాల మానవా ళి మనుగడకు అత్యవసరమైన కోర్సుల ను అందిస్తోందని చెప్పారు. రెండు రోజుల సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తల ప్రసంగాలు విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేశాయని అభిప్రాయపడ్డారు. కళాశాల మాజీ ప్రి న్సిపాల్, టీఎస్పీఎస్సీ మాజీ స భ్యుడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేష న్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత సాయి లు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరిశోధనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. తద్వారా నూతన ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని చెప్పారు.
మల్టీ డిసిప్లినరీ పరిశోధనలు ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి పరిశోధనా నైపుణ్యాలు ఏర్పరుచుకుని, తమ ఆలోచనలను సరియైన దిశలో తీ సుకుపోతే కొత్త ఆవిష్కరణల కు మార్గం సుగమమవుతుందని వివరించారు. కా ర్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రభాకర్‌రెడ్డి, సదస్సు కన్వీనర్ డాక్టర్ టి.జ్యోతి, టెక్నాలజీ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కవితా వాఘ్రే, టెక్స్టైల్ టెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ హయవదన, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనునాయక్, ఎవాల్యుయేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజం, డాక్టర్ పరశురాం, కో ఆర్డినేటర్లు డాక్టర్ పరమేశ్వర్లు, అయో ధ్య కవిత, కోదండరామిరెడ్డి, డాక్టర్ అ నిత, ప్రవీణ, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ఐలయ్య, ధీరజ్, భాస్కర్, అర్జున్, శ్రీనివాస్, సమి, రేణు, అజిత్ పాల్గొన్నారు.