న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం వెన్ను బలాన్ని పెంచుకుని దేశ ప్రయోజనాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చాయి. లోక్‌సభ జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తాయని, ముఖ్యంగా ఆటో, వ్యవసాయ రంగాలు దారుణంగా దెబ్బతింటాయన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ సముదాయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా నాయకత్వం తాను పక్కా వ్యాపారినని మరోసారి నిరూపించుకుందని, ఆ వల లో మన కస్టమర్ చిక్కుకున్నారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి విమర్శించారు. టీఎంసీ ఎంపీలూ మండిపడ్డారు.