Oppenheimer Movie | క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి బ్యాట్‌మెన్ ట్రయోలజీ (Batman Triology), ఇంటర్స్టెల్లర్ (Inter Stellar), టెనెట్ (Tenet), ఇన్సెప్షన్ (Inception), డన్కిర్క్ (Dunkirk), మెమోంటో (Memento) చిత్రాలు. అయన సినిమాలు అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం సైన్స్ అర్థం చేసుకోవాలి. అంతలా ఇంపాక్ట్ చేస్తాయి నోలన్ సినిమాలు. తాజాగా క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan Direction) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓపెన్‌హైమర్ (Oppenheimer). ఈ చిత్రం జూలై 21న విడుదల కాబోతుంది. కానీ హాలీవుడ్‌కు చెందిన ‘సాగ్’ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్టు) అసోసియేషన్ చేపట్టిన సమ్మె కారణంగా ఈ మూవీ రీలిజ్ వాయిదా పడుతుందని అభిమానులంతా అందోళన చెందుతున్నారు. అయితే సమ్మె కారణంగా ఓపెన్‌హైమర్ విడుదలకు ఎటువంటి ఆటంకం ఉండదని.. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని జులై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్(Universal Pictures) తాజాగా ప్రకటించింది.
Oppenheimer Stills
ఈ సినిమా నోలన్ గత సినిమాల మాదిరిగా కాకుండా అణుబాంబు పితామహుడిగా పేరున్న ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్’ (J. Robert Oppenheimer) జీవిత్ర చరిత్ర (Biography) ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. నాజీలకు (Nazi Army Germany) వ్యతిరేకంగా అణ్వాయుధాలను సృష్టించేందుకు అమెరికన్లు ఏం చేశారనేది సినిమా సారాంశం. ఓపెన్‌హైమర్ అమెరికా ప్రాజెక్టులో ఎలా భాగమయ్యారు, అణుబాంబును తయారు చేసేందుకు వాళ్లు పడిన ఇబ్బందులేంటి. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఆ బాంబును ప్రయోగించారా.. లేదా తెలియాలంటే జులై 21 వరకు ఆగాల్సిందే. సిలియన్ మర్ఫీ (Cillian Murphy) ఎమిలీ బ్లంట్(Emily Blunt), మాట్ డామన్ (Mat daman), రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert downey Jr.), ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. కాగా క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.